గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయండి

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

అధికారులతో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యా ప్తంగా నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు గ్రామ, వార్డు సభల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపారు. పోలీ స్‌ కమిషనర్‌ సాయి చైతన్య తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీసీలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలను షెడ్యూల్‌ ప్రకారం విజయవంతం చేయాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సభలలో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఏవోలను నోడల్‌ అధికారులుగా నియమించి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపల్‌ పట్టణాలలో వార్డుల వారీగా సభలను ఏర్పా టు చేసి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్లు కిరణ్‌ కుమార్‌, భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement