నవీపేట: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. మండలంలోని జన్నేపల్లి, సిరన్‌పల్లి గ్రామాలలో మంగళవారం సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. నూతన గృహప్రవేశాలు చేసిన దంపతులకు నూతన వస్త్రాలను అందించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న జన్నేపల్లి, సిరంపల్లి, లింగాపూర్, గాంధీనగర్ గ్రామాల అనుసంధాన రహదారి విస్తరణకు రూ. 15కోట్లు మంజూరు అయ్యాయన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జన్నేపల్లి, సిరన్ పల్లి గ్రామాల సర్పంచులు గంగాధర్, తొగరి సౌమ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


