వర్ని: నిరుపేద బడుగు బలహీనవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పో చారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని మ ల్లారం గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించా రు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించే వి ధంగా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకోవాలన్నారు. బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, డి ఆర్‌డిఎ పిడి సాయన్న, వర్ని మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబా, మల్లారం సర్పంచ్ మాడ అంజవ్వ లక్ష్మణ్ పాల్గొన్నారు.


