ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

సాక్షి నెట్‌వర్క్‌: ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌ నియోజకవర్గాల్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతర ణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలా లు, గ్రామాల్లోని ప్రభుత్వ కార్యలయాల్లో అధికారు లు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవే సి, వందనం చేశారు. అలాగే జాతీయ గేయాలపన నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరు ల త్యాగాలను స్మరించుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి జాతీ య జెండాను ఆవిష్కరించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ గోనె లహరి,, తహసీల్దార్‌, ఏసీపీ, పోలీస్‌స్టేషన్‌, సబ్‌రిజిస్టర్‌, ఆర్టీఏ, ఎకై ్సజ్‌ కార్యాలయల్లో, ఆర్మూర్‌ కోర్డుతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయల్లో సంబంధింత అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణి చేశారు. బోధన్‌ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తి వరుదిని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసి గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో విజయ కుమారి, బల్దియా కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తూము పద్మాశరత్‌ రెడ్డి జాతీయ జెండాను ఎగుర వేసి గీతాన్ని ఆలపించారు.

జీపీ కార్మికులకు కిట్స్‌ పంపిణీ

తెలంగాణ అవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా పలు గ్రామాల్లోని జీపీ కార్మికులకు రక్షణ కిట్లు (గ్లౌస్‌, హెల్మెట్‌లు, బూట్లు) అందజేశారు. అలాగే పలు జీపీల్లో కార్మికులను సన్మానించి, వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల జీపీ సిబ్బంది, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement