అటు ఆరోగ్యం.. ఇటు పర్యావరణం | - | Sakshi
Sakshi News home page

అటు ఆరోగ్యం.. ఇటు పర్యావరణం

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: వ్యక్తిగత ఆరోగ్యం.. పర్యావరణ హితం కోసం సైక్లింగ్‌ చేయాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులే కాకుండా ప్రభుత్వాలు సైతం చెబుతున్నాయి. పలు యూరప్‌ దేశాల్లో సైకిల్‌పై విధులకు వెళ్లేవారు గణనీయంగా పెరిగారు. హైదరాబాద్‌లోనూ మాదాపూర్‌, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో సైకిల్‌ ట్రాక్‌ ప్రత్యేకంగా నిర్మించారు. ఈ క్రమంలో నిజామాబాద్‌లోనూ కొందరు ఆరోగ్యాభిలాషులు ప్రతిరోజూ సైక్లింగ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరానికి చెందిన 20 మంది నాలుగు బృందాలుగా ఏర్పడి తమ సైకిళ్లతో ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్‌ చేస్తున్నారు. నిజామాబాద్‌–మంచిప్ప, నిజామాబాద్‌–మామిడిపల్లి తదితర రూట్లలో ఈ సైక్లింగ్‌ చేస్తున్నారు. డాక్టర్‌ వెంకటరమణ, మంచాల జ్ఞానేందర్‌, డాక్టర్‌ ప్రతాప్‌, తిరుమల నాయుడు, వీరేష్‌, శ్రీహరి, ప్రసాద్‌, వినోద్‌, అశోక్‌, సురేందర్‌ సైక్లింగ్‌ బృందం ప్రతిరోజూ మంచిప్ప వరకు వెళ్లడం, రావడం కలిపి 30 కిలోమీటర్లు సైక్లింగ్‌ చేస్తున్నారు. ఈ బృందం మరో 10 మందితో కలిసి గతంలో సైకిళ్లపై 440 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వరకు వెళ్లి సీతారాముల దర్శనం చేసుకుని వచ్చారు.

ప్రతిరోజూ 30 కిలోమీటర్ల మేర

సైక్లింగ్‌ చేస్తున్న ఇందూరువాసులు

గతంలో భద్రాచలం వరకు 440 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేసిన 15 మంది

నేడు అంతర్జాతీయ సైక్లింగ్‌ దినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement