పెర్కిట్(ఆర్మూర్)/బోధన్/నవీపేట: విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఆలూర్ తహసీల్దార్ రమేష్ సూచించారు. ఆలూర్ మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాలను ఆయన ఏవో రాంబాబుతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలను విక్రయించిన వారిపై క ఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఏవో రాంబాబు మాట్లాడుతూ.. రైతులు లైసెన్సు కలిగిన వారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే రషీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సాలూర మండల కేంద్రంలోని పలు విత్తన విక్రయ కేంద్రాలను తహసీల్దార్ అజ్మీత్ నవాజ్, ఏవో శ్వేత తనిఖీ చేశారు. నవీపేట మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తహసీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్‌కుమార్ తనిఖీ చేశారు. నాణ్యమైన కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విత్తనాలను రైతులకు విక్రయించాలని ఫర్టిలైజర్ దుకాణాల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


