ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Jun 3 2026 1:09 AM | Updated on Jun 3 2026 1:09 AM

రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌

రెసిడెన్షియల్‌ స్కూల్‌కు భూమిపూజ

నిజామాబాద్‌ రూరల్‌ : విద్యపై వెచ్చించేది ఖర్చుకాదని, భవిష్యత్తు తరాలకు పెట్టుబడిగా నిజామాబా ద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డి పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటుకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. మండలంలోని మల్కాపూర్‌(ఎ) గ్రామ శివారులో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రె సిడెన్షియల్‌ స్కూల్‌కు మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాభివృద్ధితో పాటు అన్నివర్గాల అభ్యున్నతికి ప్ర భుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాట మీద నిలబడే పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించే దిశగా ఇంటిగ్రేటె డ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మె ల్యే భూపతి రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ సాయరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి, రూరల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, స్థానిక సర్పంచ్‌ నీరజ కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement