గంగమ్మ ఒడి నుంచి బయటకు.. | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ ఒడి నుంచి బయటకు..

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) బ్యాక్‌వాటర్‌ పరిధిలో ఆధ్యాత్మిక అద్భుతం వెలుగుచూసింది. గత కొన్ని రోజులుగా ప్రాజెక్ట్‌ వెనుక జలాల్లో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో డొంకేశ్వర్‌ పాత గ్రామంతో పాటు ఒక పురాతన శివలింగం, రెండు నందులు బయటపడ్డాయి. గంగమ్మ ఒడిలో జలదీక్ష ముగించుకుని ఆ పరమ శివుడు సాక్షాత్కరించినట్లుగా దర్శనమిస్తున్నాడు. అయితే, జలాల నుంచి బయటపడిన శివలింగానికి గ్రామ ప్రజలు సోమవా రం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రస్తుత డొంకేశ్వర్‌ గ్రామానికి ఐదారు కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ శివలింగం.

Advertisement
 
Advertisement
Advertisement