జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుల పంట | - | Sakshi
Sakshi News home page

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుల పంట

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

కాకతీయ విద్యార్థుల ప్రభంజనం

ఖలీల్‌వాడి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో నిజామాబాద్‌ కాకతీయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని చైర్మన్‌ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. హెచ్‌. భరత్‌ 1275, జె. తన్విత 1573, బి. సంధ్య 1627, ఆర్‌. బన్ని 1834, ఎ. ఆత్రిజీ 2361 ర్యాంకులు సాధించారన్నారు. ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్‌ సీహెచ్‌. రామోజీరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో ఆలిండియా ర్యాంకులు సాధించి కాకతీయ విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్‌ సీహెచ్‌. తేజశ్విని అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ సీహెచ్‌ రాజా, ప్రిన్సిపాల్స్‌ సందీప్‌ కులకర్ణి, వి. రణధీశ్‌ శర్మ, అకడమిక్‌ కో–ఆర్డినేటర్‌ నాగరాజు, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్యాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement