అవతరణ వేడుకలకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

అవతరణ వేడుకలకు సిద్ధం

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

నిజామాబాద్‌ అర్బన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ను ముస్తాబు చేశారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్లు కిరణ్‌ కుమార్‌, భుజంగరావు, డీఆర్వో గీత ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు వినాయకనగర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

ఏర్పాట్ల పరిశీలన

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీస్‌ పరేడ్‌ మైదానం, అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య సో మవారం పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్య లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్స్‌పెక్టర్‌ శ్రీధర్‌ రెడ్డి, టౌన్‌ 4 ఎస్‌హెచ్‌వో సతీశ్‌, నిజామాబాద్‌ నార్త్‌ తహసీల్దా ర్‌ వి.అనిల్‌ గిరిధర్‌, సాయిలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement