నిజామాబాద్ ఎస్‌ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులతో విజయభేరి మోగించారు. వై. శ్రీ వర్ధన్ 203, ఎన్.సురేశ్ 1060, డి. శ్రీకాంత్ 3216, జె. యశ్వంత్ 3,424, ఎం. నివాస్ రెడ్డి 5,191, ఎస్. కృపాకర్ 5454, జె.అఖిలేష్ 5617, ఎస్. విశ్వంత్ 5931, ఏ.చరణ్ తేజ 9397 ర్యాంక్ సాధించగా 10 వేల లోపు 9 మంది విద్యార్థులు ర్యాంకు లు సాధించారు. డీజీసీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షలు, ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అత్యుత్త మ ఫలితాలు సాధించారన్నారని అన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎస్‌ఆర్ చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, అకడమిక్ డీన్ రాంరెడ్డి, ప్రిన్సిపాళ్లు హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, నర్సింహారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.


