పశువుల దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పశువుల దొంగల ముఠా అరెస్ట్‌

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

రుద్రూర్‌ : కోటగిరి మండల కేంద్రంలో బుధవారం పశువుల దొంగల ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసిన ట్టు బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుల నుంచి రెండు బొలెరో వాహనాలు, ఒక బైక్‌, ఐదు సెల్‌ఫోన్లు, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో సోమవా రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండ గా ముఠాకు చెందిన ఐదుగురు పట్టుబడ్డారు. నిందితులను మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా బిలోలికి చెందిన ఫరీద్‌ నవాబ్‌ సాబ్‌ ఖురేషీ, అస్లాం ఖురేషీ, ఇలియాస్‌ నవాబ్‌ ఖురేషీ, ఆర్మూర్‌కు చెందిన షేక్‌ రఫీక్‌, ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన మహ్మద్‌ రెహమత్‌గా గుర్తించారు. వీరిపై కోటగిరి, వర్ని, బోధన్‌, నిజామాబాద్‌ టౌన్‌ ప్రాంతాలతోపా టు జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధి లో మొత్తం 11 కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. దొంగిలించిన గేదెలు, పశువులను బోధన్‌న్‌కు చెందిన ఖురేషి అబ్దుల్లాకు విక్రయించినట్లు ఏసీపీ వివరించారు. ప్రధాన నిందితులైన సోహెల్‌ పటేల్‌ (నాందేడ్‌), సయ్యద్‌ సైఫ్‌ (బిలోలి), జియా ఖురేషీ (బిలోలి), అబుసద్‌, అబ్దుల్‌ అజీజ్‌ (బోధన్‌) పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై సునీల్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement