కొత్త విద్యా సంవత్సరంలో
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): నూతన విద్యా సంవత్సరం మరోర 14 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులు ఉంటే పాత యూనిఫామ్ లేదంటే సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే యూనిఫామ్స్ అందిస్తామ ని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు యూనిఫామ్స్ తయారీకి అవసరమైన బట్ట (క్లాథ్)ను ప్రభుత్వం సరఫరా చేయలేదు. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
జిల్లావ్యాప్తంగా 1,191 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,06,783 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూళ్ల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్ (రెండు జతలు), బ్లాక్ షూ, సాక్స్, బెల్ట్ అందించాలని ఈ నెల 27న అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది మాదిరిగానే మహిళా సంఘాలతో విద్యార్థుల యూనిఫాం కుట్టిస్తామంటూ మార్చి– ఏప్రిల్ నెలల్లోనే విద్యార్థుల కొలతలు సైతం తీసుకున్నారు. మొత్తం 1,06,783 మంది విద్యార్థుల్లో బాలికలు 57,323 మంది, బాలురు 49,460 మంది ఉన్నారు.
స్వశక్తి మహిళలకు అవకాశం
గత మూడేళ్లుగా స్వశక్తి సంఘాల మహిళలకు యూనిఫామ్స్ తయారీ చేసే బాధ్యతను అ ప్ప గించారు. ఏటా ప్రభుత్వం క్లాథ్ కొనుగోలు చేసి జిల్లా కేంద్రం నుంచి మండల వనరుల కేంద్రాలకు అందించగా, అక్కడి నుంచి స్వశక్తి సంఘాల మహిళలు తీసుకెళ్లి యూనిఫామ్స్ త యారీ చేసేవాళ్లు. గతేడాది సకాలంలో బట్ట సరఫరా చేయడంతో మహిళలు యూనిఫామ్స్ తయారీ చేసి అందించారు. యూనిఫామ్స్ కొల తల్లో వ్యత్యాసం లేకుండా ఉండేందుకు స్వశక్తి మహిళలు వేసవి సెలవులకు ముందే పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు సేకరించారు. అ యితే ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం బట్టను సరఫరా చేయలేదు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి క్లాథ్‌ను త్వర గా తెప్పించాల్సిన అవసరం ఉందని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
క్లాథ్ రాగానే కుట్టిస్తాం
విద్యార్థుల యూనిఫామ్స్‌కు సంబంధించి క్లాథ్ ఇంకా జిల్లాకు రాలేదు. రాగానే మహిళా సంఘాల సభ్యులకు యూనిఫామ్స్ తయారీ బాధ్యతలు అప్పగిస్తాం. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్థుల డ్రెస్ కొలతలు తీసుకున్నాం. – శ్రీనివాస్‌రావు,
సెక్టోరియల్ ఆఫీసర్, నిజామాబాద్
విద్యార్థుల డ్రెస్‌ల తయారీ కోసం జిల్లాకు చేరని క్లాథ్
పాఠశాలల పునఃప్రారంభం రోజున
పంపిణీ కష్టమే
ఉంటే పాత యూనిఫామ్..
లేదంటే సివిల్ డ్రెస్ వేసుకోవాల్సిందే


