డొంకేశ్వర్(ఆర్మూర్): లాభాపేక్షతో రైతుల కు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విత్తన వ్యాపారులను టా స్క్‌ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. ప్ర భుత్వ ఆదేశా మేరకు జిల్లా కేంద్రంలోని ప లు విత్తన దుకాణాలను అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసింది. స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్కులు, విత్తన ప్యాకెట్ల లా ట్ నంబర్లు, సర్టిఫికేషన్, గడువు తేదీల ను పరిశీలించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ ప్రవీణ్‌కుమార్, ఎంఏవో మహేందర్‌రెడ్డి, సీడ్ మేనేజర్ వినయ్, ఏఎస్సై గంగారాం, ఏఈవో చక్రపాణి ఉన్నారు.
నిజాంషుగర్స్ ఉద్యమకారులపై కేసు కొట్టివేత
బోధన్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, ప్రైవేట్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని డిమాండ్‌తో 2018లో ఉద్యమం చేపట్టిన సమయంలో నాయకులపై పోలీసులు నమో దు చేసిన కేసును విచారణ అనంతరం శుక్రవారం స్థానిక కోర్టు కొట్టివేసింది. బీర్కూర్ బుజ్జి, బీ మల్లేశ్, పుట్ట వరదయ్య, వి రాఘవులు, గుమ్ముల గంగాధర్, జంబిశెట్టి శంకర్‌గౌడ్, యేశాల గంగాధర్, సుల్తాన్ సాయి లు, సింగం రాములుయాదవ్, గోపి, షేక్‌బా బు,షేక్ ఫారూఖ్‌పై పోలీసులు కేసు నమో దు చేసింది. కేసు కోర్టులో ఉన్న కాలంలో వివిధ కారణాలతో రాఘవులు, షేక్‌బాబు, షేక్‌ఫారూఖ్ మృతి చెందారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేసు కొట్టివేత కార్మికులు, రైతులు, బోధన్ ప్రాంత ప్రజల విజయమని పేర్కొన్నారు.
నానో యూరియా
అంటగడుతున్నారు
బోధన్: యూరియా బస్తాలతోపాటు నానో యూరియా, సాగరిక (గుళికలు) తప్పనిసరి గా తీసుకోవాలని సొసైటీ అధికారులు ని బంధన పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాలూరలోని సహకార సొసై టీ గోదాము వద్ద శుక్రవారం సాలూర క్యాంప్, సాలూర గ్రామ రైతులు నిరసన తెలిపా రు. అవసరం లేని మందులు అంటగడుతుండడంతో తమపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్ బుకింగ్ ప్రకియపై సరైన అవగాహన లేని సన్న, చిన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర గ్రామాల రైతులు బుక్ చేసుకుంటుండడంతో స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇదిలా ఉండగా, నానో యూరియా ఇవ్వాలని అధికారుల నుంచి మార్గదర్శకాలు ఉన్నాయని సొసైటీ నిర్వాహకులు అంటున్నారు.


