సుంకెట్‌ ఉన్నత పాఠశాలలో.. | - | Sakshi
Sakshi News home page

సుంకెట్‌ ఉన్నత పాఠశాలలో..

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

డైనింగ్‌ హాళ్ల పనులు పెండింగ్‌

మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

మోర్తాడ్‌(బాల్కొండ): బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో డైనింగ్‌ హాల్‌ల నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. మన ఊరు మన బడి కార్యక్రమం కింద డైనింగ్‌ హాల్‌లను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టారు. ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చెట్ల కింద, వరండాలలోనే చేస్తున్నారు. డైనింగ్‌ హాల్‌లు అందుబాటులోకి వస్తే స్కూళ్ల పరిసరాలు దెబ్బతినకుండా ఉంటాయి. మోర్తాడ్‌, సుంకెట్‌తో పాటు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో డైనింగ్‌ హాళ్ల అసంపూర్తిగానే ఉన్నాయి. ధర్మోరాలో అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో దాత సహకారంతో పనులు పూర్తి చేశారు. వసతి గృహాలకు సంబంధించి కొన్ని చోట్లనే సౌకర్యాలను మెరుగుపరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement