20 స్కూళ్లలో పనులు పూర్తి .. | - | Sakshi
Sakshi News home page

20 స్కూళ్లలో పనులు పూర్తి ..

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హ యాంలో మన ఊరు – మన బడి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగు నీటి సౌకర్యం, మూత్రశాలల నిర్మాణం, పాఠశాలల కు రంగులు వేయడం, విద్యుత్‌ సౌకర్యం కల్పించడం, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు చేపట్టారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని పాఠశాలల్లో నిర్మా ణ పనులు సగంలోనే నిలిచిపోయాయి.

నియోజకవర్గంలో 78 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 248 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఐదు తెలంగాణ మోడల్‌ స్కూల్స్‌, మూడు సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాలు ఉన్నాయి.

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ అర్బన్‌లో నార్త్‌, సౌత్‌ మండలాలు ఉన్నాయి. నార్త్‌ మండలంలో 33 ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వం స్కూళ్ల అభివృద్ధికి నిధులు కేటాయించింది. ఇందులో 20 వరకు స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద వాష్‌రూమ్స్‌ నిర్మించారు. సౌత్‌ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లు 40 ఉన్నాయి. ఖిల్లాలోని హైస్కూలు, కోటగల్లీలోని బాలికల హైస్కూల్‌ శిథిలావస్థలో ఉండటంతో పైకప్పు రేకులతో నిర్మించారు. పులాంగ్‌ స్కూల్‌లో 200 మంది విద్యార్థులు ఉండగా ఇందులో రెండే బ్రాత్‌రూమ్‌లు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కసాబ్‌గల్లీలో ఎమ్మెల్సీ నిధులతో రెండు తరగతి గదులకు పనులు కొనసాగుతున్నాయి.

విభాగం మొత్తం అద్దె

బీసీ 33 12

సాంఘిక 32 0

ఎస్టీ 10 2

మైనారిటీ 01 0

కేజీబీవీలు 27 2

ప్రాథమిక ప్రాథమికోన్నత జడ్పీ, మండల పరిషత్‌

769 132 255

సంక్షేమ హాస్టళ్లు

జిల్లాలోని గురుకుల పాఠశాలలు

ప్రభుత్వ స్కూళ్ల సమాచారం

Advertisement
 
Advertisement
Advertisement