ఇరుకు గదుల్లో.. | - | Sakshi
Sakshi News home page

ఇరుకు గదుల్లో..

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

బోధన్‌: బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ లోని సర్కారు బడుల్లో చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి.

సాలూర మండలంలోని హు న్సా మండల పరిషత్‌ ఉన్నత పాఠ శాల పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థకు చేరగా, ఇందులో రెండు గదుల ను కూల్చివేశారు. రేకుల షెడ్డులో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల క్రితం రూ. కోటితో చేపట్టి న నూతన భవనం అర్ధంతరంగా నిలిచిపోయింది.

నిధులు మంజూరు కాక పనులు ముందుకు సాగడం లేదు. సాలూర పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్‌లో తరగతి గదుల కొరత ఉంది. నాలుగు గదులు శిథిలావస్థకు చేరాయి. 10 తరగతులకుగాను ఐదు గదులే ఉన్నాయి. వరండాలు, చెట్ల కింద చదువులు కొనసాగిస్తున్నారు.

బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌ మధుమలాంఛ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు గదులు రేకుల షెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీ, సైన్స్‌ల్యాబ్‌లు లేవు. పెంటాకుర్ధు క్యాంప్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో తరగతి గదుల కొరత వల్ల విద్య బోధనకు ఇబ్బందికరంగా మారింది. ఐదు గదులు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నాయి.

రుద్రూర్‌ మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకుచేరి కూలిపోయే దశలో ఉంది. పక్కనే ఉన్న సంస్కార్‌ సంస్థ కు సంబంధించిన భవనంలో పాఠశాలను నడుపుతున్నారు. రోడ్డు వెడల్పు పనుల్లో మరుగుదొడ్లను కూల్చివేయగా అసౌకర్యంగా మారింది. జవహార్‌నగర్‌ పాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు అసలే లేవు. పోతంగల్‌ మండలంలోని కొల్లూరు గ్రామ పంచాయతీ భవనంలో ప్రాథమిక పాఠశాలను చేసి నడుపుతున్నారు. కొత్త భవన నిర్మాణం పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి.లింగాపూర్‌ ప్రాథమిక పాఠశాలను జీపీ భవనంలో నిర్వహిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలో మైనారిటీ గురుకులను షాదీఖానాలో కొనసాగిస్తున్నారు.

రెంజల్‌ మండలం సాటాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల భవనంలో ఏడు గదులుండగా, ఇందులో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి.

బోధన్‌ పట్టణంలోని రాకాసీపేటలో ఎస్సీ బాలుర హాస్టల్‌ శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో కొనసాగుతోంది. నాలుగు ఇరుకు గదుల్లో విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. పట్టణంలోని బీసీబాలుర, ఎస్టీ బాలుర హాస్టల్స్‌ అద్దె భవనాల్లో విద్యార్థుల పాఠశాలలకు కొంత దూరంలో ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.

పోతంగల్‌ మండలం కొల్లూరు జీపీ భవనంలో నిర్వహిస్తున్న

మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల

ఐదేళ్లుగా పిల్లర్ల స్థాయి దాటని హున్సా మండల పరిషత్‌ ఉన్నత

పాఠశాల భవన నిర్మాణం

పేరు ఒక చోట..

గురుకులాలు మరో చోట

సాలూర బీసీ బాలికల గురుకుల పాఠశాల, ఎడపల్లి బీసీ బాలుర గురుకుల పాఠశాలలను బోధన్‌ పట్టణ కేంద్రంలోని ఆచన్‌పల్లి, గంజ్‌ ప్రాంతంలోని అద్దె భవనాల్లో కొన్నేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. నవీపేట బీసీ బాలికల గురుకుల పాఠశాలను నిజామాబాద్‌ నగర కేంద్రంలో నడుపుతున్నారు. ఈ గురుకులాలకు సొంత భవనాలు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement