న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
చదువు నేర్చుకునే చోటే పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు.. పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని శిథిల భవనాల్లో ప్రభుత్వ పాఠశాలలు.. నిధులు లేక నిలిచిపోయిన అసంపూర్తి పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. పాఠశాలల భవనాల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచాయి. తరగతి గదుల కొరత, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలలకు ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టడం లేదు. అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో సంక్షేమ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. మరో రెండు వారాల్లోపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల స్థితిగతులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.
నిధులు విడుదల కాక..


