బోధన్‌టౌన్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్రహ్మణ గల్లీకి చెందిన జంగం నాగ్‌నాథ్ అప్పా (58) వడబెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నాగ్‌నాథ్ అప్పా దొరికిన పని చేసుకుంటూ ఉండేవాడు. ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో కుబుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఒక కూతురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
నిజామాబాద్ అర్బన్: ప్రజల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని డీజీపీ సివీ ఆనంద్ పిలుపునిచారు. శనివారం అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సివీ ఆనంద్ మాట్లాడుతూ పెండింగ్ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. మహిళాలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీడియో కాన్పరెన్స్‌లో సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ శుభం ప్రకాశ్, ఏసీపీలు తదితరులున్నారు.
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన చంద్రశేఖర్ గౌడ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ శనివారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మనన్‌గా అవకాశం కల్పించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలని ఆమె సూచించినట్లు చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు.
నిజామాబాద్
డీడీవోపీ బదిలీ
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అధికారి (డీడీవోపీ) లక్ష్మినర్సయ్య, హైదరాబాద్ సైబర్ క్రైం బ్యూ రోకు బదిలీ అయ్యారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రంగంపేట్‌కు చెందిన లక్ష్మీనర్సయ్య 2008లో ఏపీపీగా ఎంపికయ్యారు. సెప్టెంబర్, 2022 నుంచి నిజామాబాద్ సీనియర్ ఏపీపీగా, డీడీవోపీగా విధులు నిర్వహించారు. ఆయన బదిలీ కావడంతో ఇన్‌చార్జి కోర్టు పీపీగా ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. త్వరలో డీడీవోపీ పోస్టుకు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రానున్నట్లు సమాచారం.


