డీమ్డ్‌ ఫారెస్ట్‌ భూముల గుర్తింపుపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

డీమ్డ్‌ ఫారెస్ట్‌ భూముల గుర్తింపుపై సమీక్ష

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): సుప్రీం కోర్టు ఆదేశాల మేర కు జిల్లాలో డీమ్డ్‌ ఫారెస్ట్‌, రెవెన్యూ అటవీ భూము లను గుర్తించడానికి కసరత్తు చేసున్నట్లు డీఎఫ్‌వో సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, అటవీ శాఖల ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా ఉన్న వివరాలను జియో స్పేషియల్‌ డేటాతో పోల్చి చూశా రు. యాజమాన్యంతో సంబంధం లేకుండా అటవీ లక్షణాలున్న ప్రతి ల్యాండ్‌ స్కేప్‌ను పారదర్శకంగా గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అటవీ భూముల ఆక్రమణలు జరగకుండా సరిహద్దులు, నోటిఫికేషన్లను త్వరితగతిన క్రోడికరించాలన్నారు. అటవీ, రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ శాఖలు కలిసి సమన్వయంగా దీనిని పూర్తి చేయాలన్నారు. డీఆర్‌వో గీత, ఆర్డీవోలు, ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్వోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement