సమస్యల వలయంలో పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల వలయంలో పాఠశాలలు

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

ఆర్మూర్‌: ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పలు ప్రభు త్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సమస్యలు లేకుండా ఉండగా, మరికొన్ని పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ ర్మూర్‌ పట్టణం రామ్‌నగర్‌లోని బీసీ బాలికల వసతి గృహం భవనం శిథిలావస్థలో ఉంది. భవనం పైకప్పులు పెచ్చులు ఊడుతూ ప్రమాదకరంగా మారా యి. దీంతో భవనం ఒకవైపు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం హాస్టల్లో 50 మంది విద్యార్థులే ఉన్నారు. హాస్టల్‌ భవనం బాగుంటే మరో 50 మంది వరకు విద్యార్థులు వసతి గృహానికి వచ్చే అవకాశం ఉంది. జిరాయత్‌ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం భవన నిర్మాణం కోసం నిధులు వెచ్చించినప్పటికీ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ పాఠశాలలో విద్యార్థులకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ రామ్‌ మందిర్‌ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మరుగు దొడ్లు లేకపోవడంతో రెంటి కోసం ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్మూరు, ఆలూరు మండలాల్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. డొంకేశ్వర్‌ మండలం తొండకూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మన ఊరు–మన బడి పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో డైనింగ్‌ హాల్‌, టాయిలెట్ల నిర్మాణం పనులు అసంపూర్తిగా ఉన్నాయి.

ఆర్మూర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనారిటీ గురుకులం

తొండాకూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో మూడేళ్లుగా పూర్తి కాని డైనింగ్‌ హాల్‌ నిర్మాణం

Advertisement
 
Advertisement
Advertisement