తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన సర్జన ప్రవీణ్(23) అనే యువకు డు నీటిగుంతలో ఈత కు దిగి మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ప్రవీణ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి శనివారం మండలంలోని అబ్దుల్లా నగర్ శివారులో గల కంకర మిషన్ క్వారీ నీటిగుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నేహితులు గుంతలో దిగి ఈత కొడుతుండగా ప్రవీణ్ కూడా స్నానం చేయడానికి నీటి గుంతలో దిగాడు. ప్రవీణ్‌కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గుంతలో నుంచి ప్రవీణ్‌ను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం గ్రామంలో ఉన్న ఓ ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రవీణ్‌ను చూసిన ఆర్‌ఎంపీ అప్పటికే మృతిచెందాడని ని ర్ధారించారు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నవీపేట:మండలంలోని బినో లకు చెందిన మేకల సాయిలు (60) అనే అదృశ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు.ఈనెల 28న ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సాయి లు తిరిగి రాలేదన్నారు. భా ర్య, కుమారుడితో ఇటీవల స్వల్ప వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెంది, ఇంట్లో నుంచి వెళ్లాడని తెలిపారు.కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సాయిలు భార్య మేకల లింగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


