నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

May 31 2026 1:48 AM | Updated on May 31 2026 1:48 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

కలెక్టరేట్‌లో మాక్‌ పార్లమెంట్‌ నిర్వహణ

నిజామాబాద్‌ అర్బన్‌: విద్యార్థి దశ నుంచే బాలికలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగ తి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో కిశోర బాలికలతో మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన బాలికలు స్పీకర్‌, డిప్యూటి స్పీకర్‌, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, ప్రతిపక్ష సభ్యుల పాత్రలను పోషిస్తూ సభా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సాధికారత, బాలికల విద్య, ఆ రోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, సమాజ అభివృద్ధి తదితర అంశాలపై ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వారు ప్రశ్నలను లేవనెత్తగా, మంత్రుల పాత్ర ను పోషించిన బాలికలు సమాధానాలు తెలుపుతూ మహిళలు, బాలికల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. అదనపు డీసీపీ శుభం నగ్రా లే, డీఆర్‌డీవో సాయన్న, డీఈవో అశో క్‌, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిలా సంక్షేమ అధికారిణి పద్మ, విద్యార్థినులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement