రుద్రూర్: మండల కేంద్రంలో ని జవహర్‌నగర్ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్ట ర్ బోల్తా పడగా,డ్రైవర్ తీ వ్రంగా గాయపడ్డాడు.స్థానికు లు తెలిపిన వివరాలు ఇ లా.. కోటగిరి మండలం ఎత్తొండ నుంచి సిమెంట్ బస్తాలను ట్రాక్టర్‌లో లోడ్ చేసుకొని డ్రైవర్ భూమేష్ శనివారం సాయంత్రం వర్ని మండలం కోట య్య క్యాంపునకు బయలుదేరాడు.జవహర్‌నగర్ కాలనీ వద్ద ప్రధాన ర
హదారిపై ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ భూమేష్ ట్రాలీ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే స్థా నికు లు స్పందించి ట్రాలీ కింద నుంచి డ్రైవర్‌ను బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు.వారు ఘటన స్థలానికి చేరుకొని,వివరాలు సేక రించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు.
వడ్ల లారీ బోల్తా
లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు పెద్ద తండా శివారులో శనివారం వడ్ల లారీ బోల్తా పడినట్లు తండావాసులు తెలిపారు. నల్లమడుగు– గాంధారి రోడ్డులో లారీ అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ బోల్తా పడిన సమయంలో వాహనాలు, జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తండావాసులు తెలిపారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో శనివారం పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడి నిర్వహించి పేకాడుతున్న 9మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి 10 ఫోన్లు, 3 కార్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ. 4,880 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.


