● కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలం
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
● పండిత్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ శిబిరం ప్రారంభం
సుభాష్‌నగర్: కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలమని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నూతన పదాధికారుల నైపుణ్యాలు మెరుగుపర్చడం, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా నగరంలోని బోర్గాం(పి)లో రెండు రోజులపాటు కొనసాగనున్న జిల్లాస్థాయి పండిత్ దీన్‌దయాళ్ ప్రశిక్షణ శిబిరాన్ని అర్వింద్ గురువారం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఎగురవేశారు. 1984 నుంచి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలతో కూడిన ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి, ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించాలని కార్యకర్తలకు సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అంది అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని, ఆ దిశగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి, భరత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, కంచెట్టి గంగాధర్, నాగోళ్ల లక్ష్మీనారాయణ, వివిధ మండలాల అధ్యక్షులు, మోర్చాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


