రాజకీయ కక్ష సాధింపు ధోరణిని వీడాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్ష సాధింపు ధోరణిని వీడాలి

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

రాజకీయ కక్ష సాధింపు ధోరణిని వీడాలి

ప్రజల దృష్టిని మరల్చేందుకే

ఈడీ దాడులు

సీపీఎం నాయకుల ఆరోపణ

నిజామాబాద్‌ అర్బన్‌ : కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్‌పై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు ధోరణి వీడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు అన్నారు. విజయన్‌ ఇంట్లో ఈడీ దాడులను నిరసిస్తూ గురువారం ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం రమేశ్‌ బాబు మాట్లాడుతూ దేశంలో సీపీఎం పార్టీ నాయకులు అత్యంత నీతి ని జాయితీతో ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పని చేస్తున్నారని, పదేళ్లపాటు కేరళ రాష్ట్ర సీఎంగా పనిచేసిన పినరై విజయన్‌కు సొంత ఇల్లు కూడా లేదని గుర్తుచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధ రల పెంపుతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికి సీపీఎం నాయకుల పై ఈడీ దాడులు చేశారని ఆరోపించారు. ిసీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ది వెంకట్‌ రాములు, కమిటీ సభ్యులు సుజాత, నగర నాయకులు నల్వాల నరసయ్య, అనసూయమ్మ, అనిత ,అంజయ్య, ఈవీఎల్‌ నారాయణ, అబ్దుల్‌, రాము, ఇమామ్‌, రాజు, సతీశ్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement