వ్యవసాయం
డీజిల్ ధరల పెంపుతో
పెరిగిన పెట్టుబడి ఖర్చులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చమురు ధరలు విడతలవారీగా పెరుగుతుండడంతో రైతన్నపై సాగు పెట్టుబడి భారం మరింతగా పడనుంది. రైతులు ఆందోళనతో ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. భారీగా ఖర్చులు పెరుగుతాయని, ఈ మేరకు మద్దతు ధరలు పెరిగితేనే గిట్టుబాటు అవుతుందంటున్నారు. ట్రాక్టర్లతో చేసే దుక్కులు, దమ్ముల పనులకు ధరలు పెంచినట్లు రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బోరుబావులకు డ్రిల్లింగ్ చేసే రిగ్గుల యజమానులు సైతం ధరలు పెంచారు.
సాధారణంగా రైతులకు, గృహ అవసరాలకు బోర్‌వెల్ తవ్వకం 400 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఇప్పుడు అడుగుకు రూ.15 నుంచి రూ.25 వరకు ధర పెంచారు. వ్యవసాయ బోర్లతో పాటు ఇళ్లల్లో వేసుకునే బోర్లకూ ఈ ధరలు అమలు చేస్తున్నారు. దీంతో భారం పెరిగిందని రైతులు, గ్రామీణులు చెబుతున్నారు. డీజిల్ ధరలు పెరగకముందు బోర్‌వెల్ డ్రిల్లింగ్ లోతు, పరిమాణం మేరకు అడుగుల చొప్పున డ్రిల్లింగ్ చార్జీలు తీసుకునేవారు. ధరలు పెరగడంతో రానున్న సీజన్‌కు సంబంధించి దుక్కులు, దమ్ములు, వరికోత యంత్రాలకు చెల్లింపులు భారీగా పెరుగుతాయని రైతులు అంటున్నారు.
డీజిల్ ధరల పెంపుతో పెరిగిన
పెట్టుబడి ఖర్చులు
ట్రాక్టర్లకు చెల్లింపులు, బోర్లు వేసే
రిగ్గులకు ధరల పెంపు షురూ
ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్న రైతన్నలు


