బీజేపీ, కాంగ్రెస్‌ మిలాఖత్‌ ! | - | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌ మిలాఖత్‌ !

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

ఆర్మూర్‌ : బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కలిసి పె ట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించా రు. రేవంత్‌రెడ్డిని ఫెయిల్యూర్‌ సీఎంగా రాష్ట్రంలోని చదువురాని ప్రజలు కూడా అంటున్నారని అన్నా రు. ఆర్మూర్‌ పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి వీజీ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉండటం బీఆర్‌ఎస్‌ అదృష్టమన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ఎదుర్కొని నిలిచిన కార్యకర్తలను చూస్తుంటే రాబోయే ప్రభుత్వం మనదే అనే నమ్మకం కలుగుతోందన్నారు. ప్రజలు కేసీఆర్‌ మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందన్నారు. యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతోందన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో పెట్రోల్‌, డీజీల్‌పై వ్యాట్‌ను ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్‌లో పార్టీ ఓటర్లను తొలగించకుండా అడ్డుకోవాలని బూత్‌ ఇన్‌చార్జిలకు సూచించారు.

డిజిటల్‌ పద్ధతిలో సభ్యత్వ నమోదుపై కార్యక ర్తలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్‌ ఇ న్‌చార్జిలపై ఉంటుందని వీజీ గౌడ్‌ అన్నారు. జిల్లా లో 3,130 మంది బూత్‌ కమిటీ సభ్యులు బా ధ్య తలు నిర్వహించాలన్నారు. 60 లక్షల సభ్యత్వా లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఐఆర్‌పై జి ల్లా కేంద్రంలో త్వరలో అవగాహన సదస్సులు ని ర్వహిస్తామన్నారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌గుప్తా, హ న్మంత్‌ సింధే, జెడ్పీ మాజీ చైర్మన్‌ విఠల్‌రావు, నా యకులు రాజారాం యాదవ్‌, ఆలూర్‌ విజయ భా రతిరెడ్డి మాట్లాడారు. ఆనంద్‌రెడ్డి, పోల సుధాకర్‌, పూజ నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

యుద్ధం సాకు చూపి పెట్రోల్‌,

డీజిల్‌ ధరల పెంపు

రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్‌ సీఎం

మాజీ మంత్రి, ఎమ్మెల్యే

వేముల ప్రశాంత్‌రెడ్డి

ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement