విధులు బహిష్కరించిన వీవోఏలు | - | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన వీవోఏలు

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌)/మోర్తాడ్‌(బాల్కొండ)/బోధన్‌రూరల్‌ : ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్ర భుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఐకేపీ వీవోఏలు మూడు రోజులుగా సమ్మెకు దిగారు. బుధవారం నుంచి విధులు బహిష్కరించా రు. జిల్లాలోని అన్ని మండల సమాఖ్య ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీంతో బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాల పంపిణీ నిలిచిపోవడం, స్నేహ సంఘాలకు అవగాహన శిబిరాల నిర్వహణ రద్దు అయ్యింది. వృద్ధులైన మహిళలను గుర్తించి వారితో సంఘాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో 806 మంది వీవోఏలు సమ్మెలో పాల్గొంటున్నారు. నిత్యం గ్రామాలు, పట్టణాల్లో మహిళ సంఘాలకు అందుబాటులో ఉంటూ ఐకేపీ, బ్యాంకు రుణాలు అందించడం, పొదుపుపై, ప్రభుత్వ పథకాలపై అవగహన కల్పించడం వంటి పనుల కోసం శ్రమిస్తున్నా ప్రభుత్వం తమను గుర్తించం లేదన్నారు.

వీవోఏలకు సెర్ప్‌ నుంచి రూ.5 వేల వేతనం రాగా, రూ.3 వేలు గ్రామ సంఘం ఇస్తోంది. ఈ వే తనం చాలడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. అయితే వీవోఏలు విధులకు దూరంగా ఉండడంతో బ్యాంకు లింకేజీలు, ఇతర కార్యక్రమా లపై ప్రభావం పడకుండా ఐకేపీ అధికారులు ప్ర త్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ఇబ్బందులు రాకుండా చూడాలని సీసీలకు ఆదేశాలిచ్చారు.

డిమాండ్లు ఇవే..

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి

అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలి

సాధారణ బీమా, ఆరోగ్య బీమా రూ.20 లక్షలు ఇవ్వాలి

ట్యాబ్‌, నెట్‌ సౌకర్యం కల్పించాలి

జీవో 58ని సవరణ చేసి జాబ్‌ చాట్‌ ఇవ్వాలి

ఉద్యోగ భద్రత, కనీస వేతనం కోసం మూడు రోజులుగా సమ్మెబాట

శ్రమకు తగిన గుర్తింపు లేదని

ఉద్యోగుల ఆవేదన

బ్యాంకు లింకేజీ రుణాలు,

ఇతర పనులపై ప్రభావం

Advertisement
 
Advertisement
Advertisement