తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

May 28 2026 2:16 AM | Updated on May 28 2026 2:16 AM

రైతులు ఆందోళనకు గురి కావద్దు

జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నిజామాబాద్‌ అర్బన్‌: అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యానికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రభుత్వం పరంగా కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రా ల ద్వారా రైతుల నుంచి సేకరిస్తున్న తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించే ప్రక్రి యను వేగవంతం చేయాలని అధికారుల ను ఆదేశించామన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం రాత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల నేపథ్యంలో ఆ యా జిల్లాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ త్రిపాఠి జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇప్పటికే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరిందన్నారు. అయితే దిగుబడులు ఆలస్యంగా వచ్చిన చోట ధాన్యం సేకరణ కోసం సు మారు 120 వరకు కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. అకాల వ ర్షం కురిసిన కారణంగా జిల్లాలో బషీరాబాద్‌, ఉప్లూర్‌ తదితర ప్రాంతాల్లో సుమారు 40 మెట్రి క్‌ టన్నుల వరకు ధాన్యం బస్తాలు తడిసినట్లు త మ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపించామని, తడిసిన ధాన్యాన్ని వేగవంతంగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తాను కూడా స్వయంగా మిల్లులను సందర్శించి, ధాన్యం తరలింపు, అన్‌ లోడింగ్‌ ప్రక్రియలను పరిశీలించానని కలెక్టర్‌ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీసీపీ శుభం నగ్రాలే, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement