ధాన్యం అన్‌ లోడింగ్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం అన్‌ లోడింగ్‌ వేగవంతం చేయాలి

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

రైస్‌మిల్లు ఆకస్మిక తనిఖీ

సుభాష్‌నగర్‌: రైస్‌మిల్లుల్లో ఎక్కువ సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని అన్‌లోడింగ్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నగర శివారులోని సాయి రాజ్యలక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ బాయిల్డ్‌ రైస్‌మిల్లును కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వచ్చింది.. వాటి ని దిగుమతి చేసుకున్నారా.. ఎంత పరిమాణంలో మిల్లింగ్‌ జరిపారు.. మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని ఎ లా భద్రపరుస్తున్నారు.. తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మిల్లు ఆవరణలో ధాన్యం లోడ్లతో కూడిన లారీలు నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్‌ అన్‌లోడింగ్‌ వేగవంతం చేసేలా చూడాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందు న ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మి ల్లు నిర్వాహకులకు సూచించారు. లేనిపక్షంలో ఆరు బయట, కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో మిల్లింగ్‌ చేయాలన్నారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్‌ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. అన్‌ లోడింగ్‌లో జాప్యానికి తావులేకుండా పర్యవేక్షించాలని, రోజువారీగా తనకు నివేదికలు సమర్పించాలని అధికారులతో పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట డీఎస్‌వో శ్రీ కాంత్‌ రెడ్డి, సివిల్‌ సప్లయ్‌ డీఎం ప్రవీణ్‌, ఏఎస్‌వో అరవింద్‌ రెడ్డి, రైస్‌ మిల్లుల నిర్వాహకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement