అడుగుకు రూ.110 చెల్లించాను | - | Sakshi
Sakshi News home page

అడుగుకు రూ.110 చెల్లించాను

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

ఈ నెల 19న బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ చేయించాను. 270 అడుగులకు నీళ్లు తగిలాయి. భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని 400 అడుగుల వరకు డ్రి ల్లింగ్‌ చేయించాను. మా ఏరి యా డిమాండ్‌ను బట్టి అడుగుకు రూ.110 చొ ప్పున చెల్లించాను. 39 అడుగుల వరకు కేసింగ్‌ పైపు లు వేశారు. ఇందుకోసం అడుగుకు రూ.350 చొప్పున చెల్లించాను. డ్రిల్లింగ్‌, కేసింగ్‌ పైపులకు కలిపి రూ.1లక్ష 5వేలకు పైగా ఖర్చు అయ్యింది. బోర్‌వెల్‌ డ్రిల్లింగ్‌ చార్జీలు అడుగుకు రూ.10 నుంచి రూ.25 వరకు పెంచినట్లు స్పష్టం అవుతోంది. – సుధాకర్‌, రైతు,

కుమ్మన్‌పల్లి, సాలూర మండలం

చిన్న, సన్నకారులకు భారమే

డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌ యజమానులు వ్యవసాయ పనులకు ఒక్కో గంటకు రూ.200 చొప్పున అద్దె పెంచారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు భారం పెరిగింది. ఇప్పటికే పంటల సాగు పెట్టుబడి పెరిగి ఆదాయం తగ్గిపోయింది. ట్రాక్టర్‌ అద్దె ధరలు పెరగడంతో ఇంకా భారం అవుతుంది. : కె చిన్నరాజేశ్వర్‌, రైతు, మోర్తాడ్‌

Advertisement
 
Advertisement
Advertisement