విజయరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

విజయరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్‌

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

ఆర్మూర్‌: మాజీ మంత్రి, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే శనిగరం సంతోష్‌రెడ్డి సతీమణి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో బుధవారం నిర్వహించగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ హాజరయ్యారు. విజయరెడ్డి పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం సంతోష్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు శనిగరం శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్యెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల సంస్థ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కంచెట్టి గంగాధర్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ గంట సదానందం, కొంగి సదాశివ్‌, మార గంగారెడ్డి, మార చంద్రమోహన్‌, ఇస్సాపల్లి జీవన్‌, వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement