బ్యాడ్మింటన్‌లో ప్రణవ్‌సింహ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌లో ప్రణవ్‌సింహ ప్రతిభ

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

మోపాల్‌: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ అండర్‌– 11, 13 బాలుర విభాగాల పోటీల్లో నగరానికి చెందిన ఆరె ప్రణవ్‌ సింహ ఉత్తమ ప్రతిభ చూపినట్లు అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్నాటి వాసు, వి కిరణ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 26, 27 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను మోపాల్‌ మండల కేంద్రంలోని ఫిట్‌నెస్‌ క్లబ్‌లో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రణవ్‌ను అభినందించి రెండు జ్ఞాపికలను బహూకరించారు. ప్రణవ్‌ సింహ తల్లిదండ్రులు ఆరె లక్షణ ప్రవీణ్‌కుమార్‌ (మెదక్‌ అదనపు డీఆర్డీవో) మాట్లాడుతూ తన కుమారుడు జిల్లాస్థాయి పోటీల్లో రాణించడం ఆనందంగా ఉందని, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా రాణించే విధంగా సంపూర్ణ సహకారం అందించి మరింత ప్రోత్సాహిస్తామన్నారు. ప్రణవ్‌ సింహను అభినందించిన వారిలో ఆరె శ్రీధర్‌ (దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో), ఆరె మోహన్‌, రేగుల్ల దేవీప్రసాద్‌, తీగల రఘు, క్రీడాకారులు, బంధుమిత్రులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement