మనస్తాపంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

మనస్తాపంతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య మూడు ఇసుక డంప్‌లు సీజ్‌

నవీపేట : మండలంలోని ఫకీరాబాద్‌ గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి జాదవ్‌ కృష్ణ(37) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ మంగళవారం తెలిపారు. బాసర – నవీపేట రైల్వే ట్రాక్‌ మెయింటైనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జాదవ్‌ కృష్ణ ఇంటి నిర్మాణం కోసం రూ.8 లక్షల లోన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో తనకు లోన్‌ వస్తుందో రాదోనని ఒత్తిడికి గురై మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్‌, వాడి గ్రామ శివార్లలో అక్రమంగా నిలువ ఉంచిన ఇ సుక డంప్‌లను అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌తో కలిసి స్థానిక రెవెన్యూ అధికారులు ఇసుక డంప్‌లను పరి శీలించారు. చీనూర్‌లో రెండు, వాడిలో ఒక ఇసుక డంప్‌ను సీజ్‌ చేసినట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement