రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

మాక్లూర్‌: టాటా ఏస్‌, బైక్‌ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గానగర్‌ మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆలూర్‌ మండలం రామస్వామి క్యాంప్‌నకు చెందిన కామర్తి రమేశ్‌(45) పని నిమిత్తం తన బైక్‌పై నిజామాబాద్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మాక్లూర్‌ నుంచి దాస్‌నగర్‌ వైపు వెళ్తున్న టాటా ఏస్‌ దుర్గానగర్‌ బస్టాండ్‌ సమీంలో బైక్‌ను ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలుకావడంతో రమేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement