సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా ప్రజాపరిషత్‌లో బదిలీల ప్రక్రియను అపహాస్యం చేసేలా కొందరు ఉద్యోగులు పావులు కదుపుతున్నారు. బదిలీ అయి న చోటినుంచి మళ్లీ తమకు నచ్చిన, తమ వ్యవ హారాలు చక్కబెట్టుకునే పోస్టుల్లో కొనసాగేందుకు డిప్యుటేషన్ల మంత్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆయా ఉద్యోగులు తమ సౌలభ్యం కోసం మరికొందరు ఉద్యోగులను డిప్యుటేషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, వారిని తప్పుదోవ పట్టిస్తూ అక్రమార్కులు కథ నడిపిస్తున్నారు.
ఈ వ్యవహారంలో జెడ్పీలో ఏళ్లతరబడి తిష్ట వేసిన ఓ సెక్షన్ అధికారి కీరోల్ పోషిస్తుండడంపై ఉ ద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఎనిమిదేళ్లుగా డిప్యు టేషన్ మీద ఉన్న ఈ సెక్షన్ అధికారి తనకు బదిలీ అయినప్పటికీ మళ్లీ ఇక్కడే డిప్యుటేషన్ మీద ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ హోదాలోని ఈ సెక్ష న్ అధికారి ఇతర ఉద్యోగులు, ఎంపీడీవోలతో సైతం గుర్రుగా మాట్లాడతాడని పలువురు చెబుతున్నారు.
జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం కాలపరిమితి పూర్తి అయ్యాక గత రెండేళ్ల కాలంలో సుమారు 12 మంది ఉద్యోగులు ఇష్టారీతిన డిప్యుటేషన్లు చేయించుకుని కొనసాగుతున్నారు. మళ్లీ తాజా బదిలీల కౌన్సెలింగ్ తరువాత డిప్యుటేషన్లు కొనసాగించుకునేందుకు లెక్కలు వేసుకుని కథ నడిపిస్తుండడం గ మనార్హం. ఎవరిని ఎటు పంపాలి, ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలనే విషయమై ఈ కొందరు ఉద్యోగులే నిర్ణయిస్తుండడం విశేషం. ఇందులో భా గంగా ఉద్యోగోన్నతిపై ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లిన వ్యక్తిని సైతం ఫారిన్ సర్వీసు కింద మళ్లీ ఈ జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారాల నేపథ్యంలో సిన్సియర్‌గా నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఓ మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయిన సూపరింటెండెంట్ ఒకరిని మళ్లీ జెడ్పీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జెడ్పీ నుంచి ఫారిన్ సర్వీసులో భాగంగా మైనారిటీ వెల్ఫేర్‌లో ఐదేళ్లు పనిచేసిన ఒక ఉద్యోగిపై పలు అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. ఇతనికి నిజామాబాద్ రూరల్ నియోజకవరంగలోని ఓ మండలానికి బదిలీ అయింది. ఇతను మళ్లీ ఫారిన్ సర్వీసుకు వెళతానని తోటి ఉద్యోగుల వద్ద చాలెంజ్ చేస్తుండడం గమనార్హం. మొదటగా జెడ్పీకి వెళ్లి తరువాత మరోసారి ఫారిన్ సర్వీసులో భాగంగా మైనారిటీ వెల్ఫేర్‌కు వెళతానని చెబుతున్నాడు. ఇతను పదేళ్ల పాటు ఫారిన్ సర్వీసులో ఉండడంపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
సుదీర్ఘకాలం తిష్ట వేసి, మళ్లీ కొనసాగేందుకు గాను డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ ఉద్యోగులు వికలాంగ ఉద్యోగులను సైతం తమ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్న ట్లు సదరు ఉద్యోగులు వాపోతున్నారు. కలెక్టర్ దృష్టి సారించి పనితీరును బట్టి సిన్సియర్‌గా పనిచేసే ఉద్యోగులకు అన్యాయం జరుగకుండా చూడాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.
బోధన్ నియోజకవర్గంలో ఒక మండలంలో ఇప్పటివరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఒకరు అదే నియోజకవర్గంలోని మరో మండలానికి ఇన్‌చార్జి ఎంపీడీవో అదనపు బాధ్యతలు నిర్వహించాడు. ప్రస్తుతం ఈ ఉద్యోగికి ఆర్మూర్ ని యోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అ యింది. ఆర్మూర్ నియోజకవర్గంలో సదరు మండలంలో పనిచేసే సూపరింటెండెంట్‌కు బోధన్ నియోజకవర్గంలోని సదరు మండలానికి బదిలీ అయింది. అయితే ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన సదరు సూపరింటెండెంట్ ఇప్పటివరకు పనిచేసిన మండలంలోనే సూపరింటెండెంట్‌గా, పక్క మండలంలో మరోసారి ఎంపీడీవోగా కొనసాగేందుకు డిప్యుటేషన్ ప్రయత్నాలు చేస్తున్నా డు. ఇందులో భాగంగా బదిలీపై వస్తున్న సదరు ఉద్యోగిని బోధన్ నియోజకవర్గంలోని మరో మండలం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండడం గమనార్హం.
మా డిప్యుటేషన్ల లెక్కలు మాకున్నాయ్!
బదిలీ అయినా మళ్లీ నచ్చిన పోస్టుల్లోకే వెళ్లేందుకు కొందరి మంత్రాంగం
జిల్లా ప్రజాపరిషత్‌లో కీ రోల్
పోషిస్తున్న ఓ సెక్షన్ అధికారి
నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులకు మానసిక వేదన
కలెక్టర్ దృష్టి సారించాలంటూ
పలువురి వేడుకోలు


