సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయరంగంలో ముందంజలో ఉన్న జిల్లా రైతులు అంత ర్జాతీయ ఎగుమతుల దిశగా ముందుకెళ్లాలని, విదేశీ వాణిజ్యంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం కలెక్టర్ అధ్యక్షతన సమీకృత భవనంలో వా ణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీఎఫ్‌టీ (డైరక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్), ఏపీఈడీఏ, జాతీయ పసుపు బోర్డు, నాబార్డు, ఇండియా పోస్ట్‌ల ఆధ్వర్యంలో మెగా ఎగుమతుల ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు.
నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపే తం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతుల ను గణనీయంగా పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ–కామ ర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి త దితర పంటల మార్కెట్ వైవిధ్యీకరణ అంశా లపై డీజీఎఫ్‌టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.
నాణ్యమైన దిగుబడులను అందించే పంట ల సాగు, పంట ఉత్పత్తుల మార్కెటింగ్, విదేశాలకు ఎగుమతులు, ఎరువులు, క్రిమిసంహా రక మందుల వాడకంపై రైతుల సందేహాలను ని వృత్తి చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రైతాంగం సే ద్యపు రంగంలో ఆధునిక విధానాలు, శాసీ్త్రయ పద్ధతులతో ఆదర్శ రైతులుగా పేరు పొందారన్నారు. ఆర్మూర్ ప్రాంత రైతులు అత్యధిక విస్తీర్ణంలో పసుపు సాగు చేస్తారని, వ్యవసాయ ఉత్పత్తులు, నూతన వంగడాల విషయంలో అంకాపూర్ ప్రాంత రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. కాగా విదేశీ వాణిజ్యంతో అనుసంధానం చేస్తే జిల్లా రైతులకు మరింత మేలు కలుగుతుందన్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాను పసుపు, వరి ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా కేంద్రప్రభుత్వం ప్రకటించడంతో రైతు లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డీజీఎఫ్‌టీ ప్రాంతీయ సంచాలకులు ఎస్‌ఏ చవాన్ మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలన్నారు. దీంతో గణనీయమైన లాభాలతో పా టు విదేశీ మారకద్రవ్యం పెరిగి రూపాయి మారకం బలపడుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఔషధాలు, ఇంజినీరింగ్ విడిభాగాలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఇదేవిధంగా పసుపు, వరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులనూ భారీగా ఎగు మతి చేయొచ్చన్నారు. ఫారిన్ ట్రేడ్ పాలసీ మేరకు విదేశీ ఎగుమతులకు ప్రభుత్వం తగిన రాయితీలు ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఈ– కామర్స్ ప్రాధాన్యతపై అవగాహన పెంచుకుంటే రైతులు ఉంటున్న ప్రాంతం నుంచే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తుల ఎగుమతులు చేస్తూ వ్యాపార లావాదేవీలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు అధికారులు కేవీఎస్ శైలజ, ప్రత్యూష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు విద్య, కే జనార్దన్‌రెడ్డి, ఏపీఈడీఏ అధికారి నాయుడు, నాబార్డు డీజీఎం ఎస్ ప్రవీణ్ కుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనే జర్ సురేష్‌కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.
విదేశీ వాణిజ్యంలో జిల్లా నుంచి
భాగస్వాములు కావాలి
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రోత్సాహం ఇవ్వాలి
మెగా ఎగుమతుల ప్రోత్సాహక
కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి


