సీఎంని కలిసిన చంద్రశేఖర్‌ గౌడ్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎంని కలిసిన చంద్రశేఖర్‌ గౌడ్‌

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

సీఎంని కలిసిన చంద్రశేఖర్‌ గౌడ్‌ దరఖాస్తుల ఆహ్వానం కానిస్టేబుళ్లకు పదోన్నతి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌ మోతుకూరి చంద్రశేఖర్‌ గౌడ్‌ సోమవారం హైదరా బాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సన్మానించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కల్లు గీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించినందుకు చంద్రశేఖర్‌ గౌడ్‌ రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలోని కల్లు గీత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించినట్లు చంద్రశేఖర్‌ గౌడ్‌ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని, మరో పదేళ్లు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయ మని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

డిచ్‌పల్లి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఉచిత శిక్షణ కోర్సులకు గ్రామీణ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఎం.రవికుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్‌ (31రోజులు), మగ్గం వర్క్‌ (31రోజులు), బ్యూటీపార్లర్‌ (35 రోజులు) కోర్సులలో ఉచిత శిక్షణనిస్తారని తెలిపారు. ఉచిత భోజన సదుపాయం, హాస్టల్‌ వసతి కల్పిస్తారని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్న గ్రామీణ ప్రాంత యువతులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 08461– 295428 నెంబర్‌ను సంప్రదించాలని డైరెక్టర్‌ తెలిపారు.

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో ఐదుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. సీపీ సాయిచైతన్య సోమవారం పదోన్న తి పొందిన హెడ్‌ కానిస్టేబుళ్లను అభినందించా రు. పదోన్నతి పొందిన వారిలో ఎండీ ఖలీల్‌ , గౌరీ శంకర్‌, శివకుమార్‌, దూప్‌సింగ్‌, శ్రీనివాస్‌ రావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement