నిజామాబాద్ లీగల్: పోక్సో కోర్టు, మహిళా కోర్టు ఇ న్‌చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నిజామాబాద్ మొద టి అదనపు జిల్లా కోర్టు పీపీ నర్సింహారెడ్డిని నియా మిస్తూ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం నియమించిన పీపీలను తొ లగిస్తూ వారి స్థానంలో ఇన్‌చార్జీ పీపీలను నియ మించారు. ప్రస్తుతం మహిళా కోర్టు పీపీగా ఉన్న బంటు వసంతు, పోక్సో కోర్టు పీపీగా ఉన్న ఎం.రాజారెడ్డి, ఆర్మూర్ పీపీగా ఉన్న ఖాందేశ్ శ్రీనివాస్ తొ లగించారు. ఆర్మూర్ ఇన్ చార్జి పీపీగా నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు పీపీ ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్‌ను నియమించారు. కొత్తగా పీపీలు నియామకం అయ్యే వర కు వీరు ఇన్‌చార్జీలుగా వ్య వహరించనున్నారు. న ర్సింహారెడ్డి, ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్ నియామకంపై బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మామిళ్లసాయిరెడ్డి, రెంజర్ల సురేశ్, రాజు, గణేశ్ హర్షం వ్యక్తంచేశారు.


