డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): అనాథ వృద్ధులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆలనాపాలన చూసుకోవాలి కానీ.. వృద్ధాశ్రమ నిర్వహణ ఇలాగేనా..? అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి అసంతృప్తి వ్య క్తం చేశారు. ప్రభుత్వం, రెడ్‌క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిచ్‌పల్లి మండలం రాంపూర్‌లో కొనసాగుతున్న వృద్ధాశ్రమాన్ని కలెక్టర్ గురువారం తని ఖీ చేశారు. నామ్ కే వాస్తే అన్నట్టు కాకుండా వృద్ధులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ని ర్వాహకులకు హితవు పలికారు. కిచెన్‌లో ఆహార పదార్థాలు, వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. కాలపరిమితి ముగిసిన పలు సరుకులు ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. వృద్ధులు విశ్రాంతి తీసుకునే గదుల లో కూలర్లు, టెలివిజన్ వంటి సదుపాయాలు లేకపోవడాన్ని గ మనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వా టిని సమకూర్చాలని, నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకుల పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చారు. వృద్ధులకు అల్పాహా రం, భోజనం అందించే విషయంలోనూ తప్పనిసరి గా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన మోతాదులో పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైన అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండాలన్నారు. తాను త్వరలోనే మళ్లీ ఆశ్రమాన్ని తనిఖీ చేస్తానని, నిర్వహణ తీరులో మార్పు కనిపించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అన్ని సదుపా యాలు, వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఆశ్రమం చుట్టూ ముళ్ళ పొదలు, పిచ్చి మొక్కలను శుభ్రం చే యించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిణి పద్మ, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి బుస్స ఆంజనేయులు, తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, సర్పంచ్ రమ్య, ఆర్‌ఐ భూపతిప్రభు తదితరులు ఉన్నారు.
అనాథ వృద్ధులను
కుటుంబ సభ్యులుగా భావించాలి
అల్పాహారం, భోజనం అందించడంలో జాగ్రత్తలు తీసుకోవాలి
అన్ని రకాల ఔషధాలు
అందుబాటులో ఉంచండి
కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
రాంపూర్‌లోని వృద్ధాశ్రమం తనిఖీ


