సాంగ్లీలో కష్టకాలం | - | Sakshi
Sakshi News home page

సాంగ్లీలో కష్టకాలం

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

మోర్తాడ్‌(బాల్కొండ): దొన్కల్‌కు చెందిన రైతు కల్లెం శ్రీనివాస్‌ 75 క్వింటాళ్ల పసుపును సాంగ్లీ మార్కెట్‌కు వారం రోజుల క్రితం తరలించారు. ని జామాబాద్‌ మార్కెట్‌ కన్నా సాంగ్లీలో ధర ఎక్కువ లభిస్తుందని భావించగా, అక్కడి మార్కెట్‌లో ధర పడిపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. గోదాంలో పసుపు సంచులను నిలువ ఉంచి ఇంటికి తిరిగొ చ్చాడు. ధర పెరుగుతుందనే ఆశతో రెండు రోజుల క్రితం మళ్లీ సాంగ్లీకి వెళ్లగా ఇంకా తగ్గిపోయింది. చేసేదేమీ లేక ఆ రైతు ఇంటిముఖం పట్టాడు.

ఇది ఒక్క రైతు శ్రీనివాస్‌కు ఎదురైన గడ్డు పరిస్థితే కాదు. ఎన్నో ఆశలతో సాంగ్లీ మార్కెట్‌కు పసు పును తరలిస్తున్న రైతులకు ఊహించని దెబ్బ తగులుతుండటంతో పంటను విక్రయించుకోలేక నిరాశ తో ఇంటికి వస్తున్నారు. ధర పెరిగినప్పుడే విక్రయించాలని రైతులు ఆశిస్తున్నారు. జాతీయ మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన సాంగ్లీలో నిజామాబాద్‌ మా ర్కెట్‌ కన్నా తక్కువ ధర పలుకుతోంది.

పేరుకుపోయిన నిల్వలు..

పెద్ద వ్యాపారులతోపాటు కాస్మోటిక్‌, ఔషధ త యారీ కంపెనీల ప్రతినిధులు, విదేశాలకు ఎగు మ తి చేసేవారు సాంగ్లీ మార్కెట్‌లో పసుపు కొ నుగో లు చేస్తారు. వారం పది రోజులనుంచి సాంగ్లీ మా ర్కెట్‌కు తెలంగాణ, కర్ణాటక, ఏపీ నుంచి పసుపు బస్తాలను రైతులు తరలిస్తున్నారు. నిలువలు పేరుకుపోవడంతో కొనుగోలుదారులు ధర తగ్గించారు. మొదట్లో రూ.18 వేల వరకు ఉన్న ధర ఇప్పుడు రూ.12 వేలకు పడిపోయింది. నిజామాబా ద్‌లో నాణ్యత ఉన్న పసుపు క్వింటాల్‌ ధర రూ.12 వేల నుంచి రూ. 14 వేల వరకు పలకడం గమనార్హం.

జాతీయ మార్కెట్‌లో

పడిపోయిన పసుపు ధరలు

ఊహించని విధంగా తగ్గిన ధర

తరలించిన పసుపును అక్కడే నిలువ చేసి ఇంటి ముఖం పడుతున్న రైతులు

ఇదే తొలిసారి

సాంగ్లీలో నిజామాబాద్‌ మా ర్కెట్‌ కన్నా తక్కువ ధర ల భించడం ఇదే తొలిసారి. మే ము ఎన్నో ఏళ్ల నుంచి సాంగ్లీ మార్కెట్‌ను నమ్ముకొని పసు పును తరలించి విక్రయిస్తు న్నాం. ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది.

– శ్రీధర్‌, రైతు, అంక్సాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement