బోధన్‌ను లాజిస్టిక్‌ నోడ్‌గా మారుస్తాం | - | Sakshi
Sakshi News home page

బోధన్‌ను లాజిస్టిక్‌ నోడ్‌గా మారుస్తాం

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

బోధన్‌: నిత్యావసర సరుకుల రవాణాను క్రమబద్ధీకరించడంతోపాటు స్థానిక పరిశ్ర మలు, వ్యవసాయ, వాణిజ్యానికి కీలకమై న బోధన్‌ను లాజిస్టిక్స్‌ నోడ్‌గా మార్చడ మే ల క్ష్యమని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) సంతోష్‌కుమార్‌ వర్మ అన్నారు. రైల్వేలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి గురువారం ఆయన బోధన్‌ పట్టణంలోని రాకాసీపేట్‌ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ట్రాక్‌లు, గూడ్స్‌యార్డ్‌ పనితీరు, భద్రత తదితర వాటిని పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేయడం, గూడ్స్‌ యార్డు కోసం వ్యుహాత్మక పునర్నిర్మాణ ప్రణాళికను రూ పొందించడం తమ పర్యటన ప్రధాన ఉద్ధేశమని ఆయన వెల్లడించారు. రైల్వే మౌళిక సదుపాయాలను ఆధునీకరించడంతోపాటు బోధన్‌ ప్రాంతంతో సామాజిక, ఆర్థిక అనుసంధానాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టిసారించామని పేర్కొన్నారు. ఆయన వెంట సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (కో ఆర్డినేషన్‌) పీటీవీ దుర్గాప్రసాద్‌, సీనియర్‌ డీఈఈ మెయింట్‌నెన్స్‌ బీ.హేమానాయక్‌తోపాటు సీనియర్‌ అధికారులు ప్రశాంత సా యికృష్ణ, విజయ్‌కుమార్‌, శశాంక్‌ నామ్‌దేవ్‌, ఎం.లక్ష్మీనారాయణ, వి.విద్యాధర్‌, అనిరుధ్‌కుమార్‌, వై.సృజన్‌కుమార్‌ ఉన్నారు.

డ్రైవర్‌, కండక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ రూరల్‌: కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బస్సులు నడిపేందుకు డ్రైవర్లు, టికెట్‌ ఇవ్వడానికి కండక్టర్ల నియామకం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో కో రారు. డ్రైవర్లకు తెలుగులో రాయడం, చదవడం రావడంతోపాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్‌ వె హికిల్‌, హెవీ గూడ్స్‌ వెహికిల్‌ లైసెన్స్‌ లేదా హెవీ ప్యాసింజర్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి 18 నెలల అనుభవం ఉండి, 25 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు వారై ఉండాలని పేర్కొన్నా రు. అలాగే కండక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు పదో తరగతి ఉత్తీర్ణులై, 21 నుంచి 58 సంవత్సరాలోపు వయస్సు వారై ఉండాలని, ఆసక్తి గల వారు ఆర్‌ఎం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

ఆర్గానిక్‌ ఉత్పత్తులను రాయితీపై అందించాలి

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): గ్రామీణ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ‘ఫ్యాక్ట్‌ కంపెనీ’ ద్వారా ఆర్గానిక్‌ ఉత్పత్తులను రాయితీపై అందించాలని ప్రభుత్వరంగ సంస్థ ఫ్యాక్ట్‌ కంపెనీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ కంపెనీ డీజీఎం సురేశ్‌ను జేఎంకేపీఎం ఎఫ్‌పీవో చైర్మన్‌ పాట్కూరి తిరుపతిరెడ్డి కోరారు. ఎఫ్‌పీవో డైరెక్టర్లతో కలిసి గురువారం హైదరాబాద్‌కు వెళ్లి డీజీఎంను కలిశారు. ఈ సందర్భంగా పసుపు ఉత్పత్తులను అందజేశారు. ఫ్యాక్ట్‌ కంపెనీ ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రసాయన రహిత పసుపు పండించి దిగుబడిని పెంచే విధంగా సహకారం అందించాలని డీజీఎంను కోరారు. డైరెక్టర్లు పుప్పాల నాగేశ్‌, పెద్ద చిన్నయ్య తదితరులు డీజీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement