ఖలీల్‌వాడి: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు డీజీఎం గోవర్ధన్‌రెడ్డి, జోనల్ ఆఫీసర్ శ్రీకాంత్ తెలిపారు. కళాశాలలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జేఈఈ మెయిన్స్ తోపాటు అడ్వాన్స్, నీట్, ఎంసెట్ పరీక్షలకు తమ కళాశాల విద్యార్థులు ప్రత్యేక శిక్షణతో జాతీయ ర్యాంకులు సాధించినట్లు వారు పేర్కొన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు సరిగ్గా అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టడంతో ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనుగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి, సీఈవో సురేందర్‌రెడ్డి అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రాంబాబు, ప్రిన్సిపాళ్లు హన్మంత్‌రావు, నర్సింహారెడ్డి, దేవేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


