కథంతా కమీషన్‌ చుట్టే.. | - | Sakshi
Sakshi News home page

కథంతా కమీషన్‌ చుట్టే..

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

మాక్లూర్‌ మండలం నుంచి కదలని ధాన్యం బస్తాలు

మాక్లూర్‌: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభు త్వం ప్రారంభించి అధికారులపై వదిలేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ధాన్యం కాంటా, లోడింగ్‌కు కూలీలు ఎప్పటిలాగే సంచికి రూ.15 కమీషన్‌ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నా.. కొందరు అధికారులు మాత్రం రూ.17 నుంచి రూ.18 వసూలు చేయాలని అటు కూలీలపై, ఆ మొత్తాన్ని చెల్లించాలని రైతులపై ఒత్తిడి చేస్తున్న ట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంచికి తమకు రూ.2 నుంచి రూ.3 చెల్లించాలని అప్పు డే కాంటా చేయిస్తామని అధికారులు కండీషన్‌ పెడుతున్నట్లు సమాచారం. తాము కమీషన్‌ అధికంగా వసూలు చేసి మీకెందుకు ఇవ్వాలని కూలీ లు అసలు కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి ఏర్పడింది. అటు రైతులు సైతం ఎప్పటిలాగే రూ.15 చెల్లిస్తామని చెబుతుండడంతో ధాన్యం కాంటా నిలిచిపోయింది. మాక్లూర్‌ సొసైటీ పరిధిలో సుమారు 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రంలో మాత్రమే కాంటా చేస్తూ ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఇక్కడి రైతులు కమీషన్‌ రూ.18 వరకు చెల్లిస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలుతోంది. కమీషన్‌ కండీషన్‌ పెట్టిన వారిలో ఒకరైన ఓ అధికారి తన సొంత లారీల ద్వారా ధాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

మండలంలోని ముల్లంగి(బి), గుత్ప, మా క్లూర్‌తోపాటు అదనంగా మరో 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తరలుతుండగా.. మిగ తా 12 చోట్ల మాత్రం రైతులకు పడిగాపులు తప్ప డం లేదు. చాలా కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికీ హమాలీలు రాలేదు. కొన్ని కేంద్రాల్లో కొంత మేర ధాన్యం కాంటా అయినప్పటికీ అక్కడి నుంచి త రలించలేదు. ఒక్క గుంజ్లి కొనుగోలు కేంద్రం నుంచి మాత్రమే ఇప్పటి వరకు ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించారని, మిగతా కొనుగోలు కేంద్రాల్లో ఎందుకు కాంటా చేయడం లేదని రైతు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడవకుండా కాపాడు కునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో విసుగెత్తిన చాలా మంది రైతులు ఇప్పటికే ప్రైవేట్‌ వ్యక్తులకు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మాక్లూర్‌ సొసైటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రూ.15 కమీషన్‌తో కాంటాలు జరిపించాలని రైతులు కోరుతున్నారు.

హమాలీల కొరత వల్లే..

హమాలీల కొరత తీవ్రంగా ఉండటం వల్లే సంచికి రూ.15 బదులు రూ.18 కమీషన్‌ ఇవ్వాలని చెబుతున్నాం. ఇందులో మాకు రావాల్సింది ఏమీ ఉండదు. రూ.15 కమీషన్‌కు హమాలీలు ముందుకు రావడం లేదు. సంచికి రూ.18 చెల్లిస్తామంటేనే వస్తామంటున్నారు. అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది లేక సంచికి రూ.18 కమీషన్‌ ఇస్తామని చెప్పి హమాలీలను తీసుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం రైతులతో చెప్పాం.

– స్వప్న, మాక్లూర్‌ సొసైటీ క్లస్టర్‌ అధికారిణి

సంచికి రూ.17 నుంచి రూ.18 కమీషన్‌ చెల్లిస్తేనే కాంటా..

లేదంటే ఎక్కడి కుప్పలు అక్కడే

లేబర్‌ చార్జీల్లోనూ

కక్కుర్తి పడుతున్న అధికారులు!

దిక్కుతోచని స్థితిలో రైతులు

Advertisement
 
Advertisement
Advertisement