● జిల్లాలో 392 పాఠశాలల ఎంపిక
● 2 నుంచి 10 కిలో వాట్ల వరకు
● కిలో వాట్‌కు రూ.లక్ష చొప్పున నిధులు
ఖలీల్‌వాడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నాబార్డు నిధులతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఫలితంగా విద్యుత్ బి ల్లుల భారం తప్పడమే కాకుండా అదనపు ఆదా యం సమకూరే అవకాశం ఉంది. జిల్లాలోని 392 పాఠశాలల్లో కొత్తగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ, జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్, ప్రాథమికోన్నత, ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయి. త్వరలో మిగితా వాటిలో కూడా ఏర్పాటు చేయనున్నారు.
త్వరలోనే టెండర్లు..
పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ విద్యుత్ ఏర్పాటుతో ప్రభుత్వానికి బిల్లుల భారం తగ్గనుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఒక్కో పాఠశాలలో రెండు కిలోవాట్స్ విద్యుదుత్పత్తి చేయనున్నారు. ఒక కిలోవాట్‌కు రూ.50 వేల చొప్పున రెండింటికి కలిపి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. నిర్వహణ ఖర్చులను ప్రభుత్వం భరించనుంది. ఐదు సంవత్సరాలపాటు సంస్థతో నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
త్వరలో ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నారు. కాగా, సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకొని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. దీంతో పాఠశాలకు అదనపు ఆదాయం వస్తుంది. వచ్చిన నిధు లను పాఠశాల అభివృద్ధికి కేటాయించనున్నారు.
మండలం పాఠశాలల
సంఖ్య
ఆలూర్ 07
ఆర్మూర్ 28
బాల్కొండ 09
భీంగల్ 16
బోధన్ 21
చందూర్ 01
ధర్పల్లి 12
డిచ్‌పల్లి 21
డొంకేశ్వర్ 03
ఇందల్వాయి 14
జక్రాన్‌పల్లి 15
కమ్మర్‌పల్లి 12
కోటగిరి 03
మాక్లూర్ 09
మెండోరా 07
మోర్తాడ్ 08
మోస్రా 03
మోపాల్ 16
నందిపేట్ 14
నవీపేట్ 15
సిరికొండ 15
వేల్పూర్ 14
వర్ని 09
ఎడపల్లి 16
ఏర్గట్ల 04
మండలాల వారీగా పాఠశాలలు
సర్కారు బడులకు మేలు
జిల్లాలో 392 పాఠశాలలకు సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నిర్ణయంతో స ర్కారు బడులకు మేలు జరగనుంది. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ వీటి నిర్వహణ చేపట్టనుంది. కొన్ని పాఠశాలల్లో ఇదివరకు పైలెట్ ప్రాజె క్ట్ కింద ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతున్నాయి.
– పార్శి అశోక్, డీఈవో,
నిజామాబాద్


