క్రీడలతో మానసిక, శారీరక చైతన్యం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక, శారీరక చైతన్యం

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

జిల్లా జడ్జి భారతలక్ష్మి

అట్టహాసంగా నిజామాబాద్‌

ప్రీమియర్‌ లీగ్‌ –2026 ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌: మానసిక, శారీరక చైతన్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా జడ్జి భారతలక్ష్మి అన్నారు. నిజామాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నిజామాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌ – 2026’ను జిల్లా కేంద్రంలోని ఉమె న్స్‌ కళాశాల గ్రౌండ్‌లో న్యాయమూర్తి సోమ వారం ప్రారంభించారు. ఉద్యోగుల్లో ముఖ్యంగా పోలీస్‌, న్యాయశాఖ వంటి శాఖల్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి లోనవుతారని, ఇటువంటి పరి స్థితుల్లో శారీరక, మానసిక ఉత్సాహం కోసం ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. సీపీ సాయిచైతన్య, అదనపు ఎన్‌ఎస్‌ఈ కన్వీనర్‌, డీసీపీ (అడ్మిన్‌) జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఏఆర్‌) రామచంద్రరావు, ఎన్‌ఎస్‌ఈ జనరల్‌ సెక్రెటరీ డాక్ట ర్‌ కవితారెడ్డి , ట్రెజరర్‌ సంతోష్‌, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ రజనీకాంత్‌, శివప్రసాద్‌, దుశ్శంత్‌, ఎన్‌ఎస్‌ఈ ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లు పాల్గొన్నారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధ న్‌, సీటీసీ ట్రాఫిక్‌ ఏసీపీలు ప్రకాశ్‌, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజశేఖర్‌, మస్తాన్‌ అలీ, ఫోర్త్‌ అడిషనల్‌ జడ్జి దుర్గాప్రసాద్‌, సెకండ్‌ అడిష నల్‌ జడ్జి నారాయణ, పీడీఎం గోపీకృష్ణ, సీఐలు, ఎస్సైలు, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు.

మొదటి మ్యాచ్‌లో పోలీస్‌ టీమ్‌ విన్‌

మొదటి మ్యాచ్‌లో న్యాయశాఖ జట్టుపై 44 పరుగు ల తేడాతో పోలీస్‌ టీమ్‌ గెలుపొందింది. మొదట పోలీస్‌ జట్టు బ్యాటింగ్‌చేసి 8 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పొయి 81 పరుగులు చేసింది, అనంతరం బ్యా టింగ్‌ చేసిన న్యాయశాఖ జట్టు 8 ఓవర్లలో కేవలం 37 పరుగులుచేయగా, 44 పరుగుల తేడాతో పోలీస్‌ జట్టు విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement