అమ్మకు అక్షరమాలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అమ్మకు అక్షరమాలపై అవగాహన కల్పించాలి

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

అమలు తీరుపై అధికారుల సమీక్ష

బోధన్‌: ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ ఆఫ్‌ లైప్‌లాంగ్‌ లర్నింగ్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమం కింద అమవుతున్న అమ్మకు అక్షరమాల కార్యక్రమం ప్రాధాన్యతపై నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాలని జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు పురుషోత్తం సూచించారు. సోమవారం ఎడపల్లిలో వయోజన విద్య ఉద్యోగ, సిబ్బందితో కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 15 నుంచి 60 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్‌ యాప్‌లో వారి పేర్లను నమోదు చేయాలన్నారు. కార్యక్రమం అమలులో అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. మండలంలో ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ(ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ అసిస్‌మెంట్‌ టెస్ట్‌–పునాది అక్షరాస్యత , సంఖ్యా అంచనా పరీక్ష) ఇటీవల నిర్వహించగా, 1074 మందికిగాను 1038 మంది పరీక్షలకు హజరయ్యారని తెలిపారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ దత్తాద్రిని కలిసి కార్యక్రమం అమలు తీరు పై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ఏపీవో అరుంధతి, ఏపీఎం రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement