ఆదర్శం.. నూత్‌పల్లి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. నూత్‌పల్లి

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

ఉపాధిహామీతో ఊరు బాగు..

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

– 8లో u

నూత్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం

నూత్‌పల్లి.. ఎస్సారెస్పీలో ముంపునకు గురైన గ్రామాల్లో ఇదొకటి. డొంకేశ్వర్‌ మండలంలో ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఇప్పుడు మోడల్‌ విలేజ్‌ను తలపిస్తోంది. దశాబ్దాల క్రితమే వేసిన మాస్టర్‌ ప్లాన్‌కు తోడుగా ఉపాధిహామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకొని అభివృద్ధికి బాటలు వేసుకుంది. వాణిజ్య పంటలు, పొలాల్లో కల్లాలు, విశాలమైన రోడ్లు, ఇంటికో చెట్టు, వీడీసీ వ్యవస్థ రద్దు, ప్లాస్టిక్‌ నిషేధం లాంటి నిర్ణయాలు గ్రామాన్ని జిల్లాలోనే ప్రత్యేకంగా నిలబెట్టాయి. పాలకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో నూత్‌పల్లి ముందుకు దూసుకుపోతున్నది.

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో ముంపునకు గురైన నూత్‌పల్లి గ్రామాన్ని ఎగువ ప్రాంతంలో నిర్మించుకున్నారు. భవిష్యత్‌ను ఆలోచించి 1978లోనే ఇంజినీర్‌తో మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయించి ఇళ్ల స్థలాలు, రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడే ఇళ్లను విశాలంగా, ఒక క్రమ పద్ధతిలో నిర్మించుకున్నారు. పర్యావరణంపై మక్కువతో ప్రతి ఇంటి ఎదుట వేపచెట్లను పెంచి గ్రామాన్ని పచ్చదనంతో నింపేశారు. ఓపెన్‌ జిమ్‌, సొసైటీ గోదాములు, కమ్యూనిటీ భవనాలు, పాఠశాలలు, బ్యాంకులు సైతం ఏర్పడ్డాయి.

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడంలో ఈ గ్రామం జిల్లాలో ముందున్నది. ఉపాధిహామీ పథకంతో ఊరిలో అన్ని వీధుల్లో సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. జిల్లాలో మరెక్కడా లేని విధంగా రైతుల సౌకర్యార్థం వారి తోటల్లోనే పంటలు ఆరబోసుకోవడానికి వందల్లో సీసీ కల్లాలు, పదుల సంఖ్యలో పశువుల షెడ్లు నిర్మించుకోవడం గమనార్హం. ఐహెచ్‌హెచ్‌ఎల్‌ పథకంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, తోటలకు మట్టి రోడ్లు నిర్మించుకున్నారు.

వాణిజ్య పంటలు సాగు చేయడంలో నూత్‌పల్లి రైతులకు ప్రత్యేకత ఉంది. వంద ఎకరాల్లో పసుపు, మక్క, జొన్న, సజ్జ, ఆయిల్‌పాం, వరి పంటలు పండిస్తూ ఆర్థి కంగా ఎదుగుతు న్నారు. ఇప్పుడు ప్రతి రైతు ఇంటి ఎ దుట ఒక ట్రాక్టర్‌, కారు ఉంది.

డొంకేశ్వర్‌ మండలంలోని నూత్‌పల్లి గ్రామ ముఖచిత్రం

వీడీసీ రద్దు చేసి.. ప్లాస్టిక్‌ను నిషేధించి..

గ్రామంలో అందరూ సమానమే అన్న భావనతో, ఎవరి పెత్తనం ఉండకూడదని కొన్ని నెలల కిందట వీడీసీ వ్యవస్థను రద్దు చేసుకున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించి ఆదర్శంగా నిలిచారు. శుభకార్యాల్లో భోజనాల కోసం స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులను గ్రామ పంచాయతీ ఉచితంగా అందిస్తోంది.

దశాబ్దాల క్రితమే మాస్టర్‌ప్లాన్‌తో

ఊరి నిర్మాణం

విశాలమైన సీసీ రోడ్లు,

ఇంటికో వేప చెట్టు

ధాన్యం ఆరబోసేందుకు

రైతుల తోటల్లో కల్లాలు

ఉపాధి హామీ పథకాన్ని వందశాతం ఉపయోగించుకున్న ఏకై క

గ్రామంగా పేరు

ఇటీవల వీడీసీ వ్యవస్థ రద్దు,

ప్లాస్టిక్‌ నిషేధంతో ప్రత్యేక గుర్తింపు

Advertisement
 
Advertisement
Advertisement