● మూడేళ్లలో రూ.7.91 కోట్లకు లెక్కల్లేవ్
● లెక్క తప్పుతున్న ఖర్చులు
● పలు పంచాయతీల్లో అక్రమాలు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): జిల్లాలోని పలు గ్రామపంచాయతీల ఖర్చులు లెక్క తప్పుతున్నాయి. నిధులు భారీగా దుర్వినియోగవవుతున్నా యి. దుర్వినియోగమైన సొమ్మును ఖజానాలో జమ చేయించేలా ఆడిట్ శాఖ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు త మకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండాపోయాయి.
పలు పనుల్లో అక్రమాలు
2023–24 ఆర్థిక సంవత్సరంలో జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌లో 20 అభ్యంతరాలకు సంబంధించి రూ.2.27 లక్షలకు లెక్కలు లేకుండా పోయాయి. అలాగే మునిపల్లిలో రూ. 1.79 లక్షలకు, తొర్లికొండలో రూ.41,620 సొమ్ముకు లెక్కలు లేవు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా జక్రాన్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024–25 సంవత్సరంలో జక్రాన్‌పల్లి మండలంలో ప్రత్యేక అధికారి పాలనలో పడకల్ గ్రామ పంచాయతీలో రూ.55,684 సొమ్ముకు లెక్కలు లేవని ఆడిట్ అధికారులు తేల్చారు. ఇదే గ్రామంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.7.31 లక్షల సొమ్ము దుర్వినియోగమైంది. ఇలా పరిశీలిస్తూ వెళ్తే జిల్లాలోని చాలా మండలాల్లో వందల సంఖ్యలో అభ్యంతరాలకు సంబంధించి రూ.లక్షల నిధులకు లెక్కలు లేకుండా పోయాయి. సర్పంచులతోపాటు ప్రత్యేక అధికారుల పాలనలో కుడా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.
సంవత్సరం ఆడిటెడ్ జీపీలు అభ్యంతరాలు లెక్కలో లేని నిధులు
2022-23 530 7,308 1,93,42,669
2023-24 530 5,940 4,13,23,336
2024-25 530 3,373 1,54,46,503
16621 7,91,12,508
ప్రతి ఏటా లక్షల్లో అక్రమాలు
గ్రామ పంచాయతీలు సక్రమంగా పనిచేస్తే ప్రజలకు రోడ్లు, మురికి కాల్వలు, మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. కానీ కొంతమంది సర్పంచులు ప్రజల సొమ్మును అప్పనంగా మింగేశారు. ఫలితంగా వేలల్లో ఆడిట్ అభ్యంతరాలు నమోదవుతున్నాయి. ఆడిట్‌శాఖ ప్రతి ఏడాది మే నెల నుంచి పంచాయతీలలో ఆడిట్ నిర్వహించి డిసెంబర్‌లో ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిస్తుంది. 60 రోజుల్లో సరైన బిల్లులు చూపించకపోతే చర్యలు తీసుకోనే అవ కాశం ఉంది. అయితే జిల్లాలో గత మూడేళ్లలో 16,621 అభ్యంతరాలకు సంబంధించి రూ.7.91 కోట్లకు లెక్కలు లేకుండా పో యాయి. సరైన బిల్లులు, ఆధారాలు చూపెట్టడంలో గ్రామ కార్యదర్శులు విఫలమవుతున్నారు. చాలా చోట్ల పనులు జరగకున్నా ఎంబీ రికార్డులు సృష్టించి బిల్లులు లేపుతున్నారు.


